ఆంధ్రప్రదేశ్‌

పలువురు పోలీసు అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్న డీఎస్పీలతోపాటు అదనపు ఎస్పీలకు పోస్టింగ్‌లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి. సిఐడి డిఎస్పీ జి వెంకటరాముడు కర్నూలు జిల్లా ఆదోని ఎస్‌డిపిఓగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తున్న వైబిపిటిఏ ప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్ ఏసీపీగా నియమించారు. రాజమండ్రి అర్బన్ డిఎస్పీగా పని చేస్తున్న జె కులశేఖర్‌ను కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఎస్‌డిపిఓగా బదిలీ చేశారు. అదేవిధంగా కృష్ణాజిల్లా నందిగామ ఎస్‌డిపిఓగా విధులు నిర్వహిస్తున్న టి రాధేష్ మురళిని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్‌డిపిఓగా నియమించారు. ఇక్కడ పని చేస్తున్న బి శ్రీనివాసరావును పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఎక్సైజ్ డిఎస్పీ రా రాఘవేంద్ర కడప జిల్లా రాజంపేట ఎస్‌డిపిఓగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా పోలీసుట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డిఎస్పీ ఎం రామకృష్ణయ్యను పుట్టపర్తి ఎస్‌డిపిఓగా నియమించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డి రామవర్మను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా విశాఖపట్నం తూర్పు ఏసీపీ ఏ నరసింహామూర్తిని విశాఖపట్నం రూరల్ స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ బ్రాంచి డిఎస్పీ ఆర్ విజయభాస్కరరెడ్డిని సిఐడి డిఎస్పీగా బదిలీ చేశారు.
వెయిటింగ్‌లకు పోస్టింగ్‌లు
ఇదిలావుండగా.. పోస్టింగ్‌ల కోసం వెయిటింగ్‌లో ఉన్న పలువురు అదనపు ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి షేక్‌షావలిని కడప 11వ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అదనపు ఎస్పీలు జె రామమోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురం ఓఎస్‌డిగా స్ధానం కల్పించారు. బి లక్ష్మీనారాయణకు కడప ఓఎస్‌డీగా, పివి రవికుమార్‌కు విశాఖపట్నం రూరల్ అడ్మిన్ అదనపు ఎస్పీగా, బి శరత్‌బాబుకు ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్‌డిగా, బి ఉమామహేశ్వర్‌ను విశాఖపట్నం రూరల్ క్రైం అదనపు ఎస్పీగా నియమించారు. అదేవిధంగా రిజర్వు అదనపు ఎస్పీ చిట్టయ్యకు విజయవాడ పోలీసు కమిషనరేట్ హోంగార్డ్సు కమాండెంట్‌గా పోస్టింగ్ కల్పించారు. విశాఖపట్నం హోంగార్డ్సు కమాండెంట్ డి రామచంద్రరాజును విశాఖపట్నం సిటి ఆర్మ్‌డ్ రిజర్వు అదనపు డీసీపీగా బదిలీ చేస్తూ ఇక్కడ పని చేస్తున్న బి రామకృష్ణను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.