ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా సోషల్ మీడియా అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 10: నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సోషల్ మీడియా సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6గంటల నుండి ప్రారంభమైన అవార్డుల కార్యక్రమం సీనితారలతో కళకళలాడింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సోషల్ మీడియా సమ్మిట్ అవార్డుల కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. వివిధ విభాగాల్లో అవార్డులను అందజేశారు. ముఖ్యంగా స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్‌గా కరీనాకపూర్‌కు అవార్డును అందజేశారు. మ్యూజిక్ విభాగంలో రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌కు, తెలుగు సినీపరిశ్రమ నుండి సమంతాకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీధర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ లక్ష్మీకాంతం, టూరిజం డిపార్ట్‌మెంట్ చైర్మన్ జయరామిరెడ్డి, కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సీఈఓ హిమాన్షుశుక్లా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. కాగా, సోషల్ మీడియా అవార్డుల కార్యక్రమానికి వచ్చిన తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరీనాకపూర్, సమంత, సిమ్రాన్‌చౌదరి, నటాషాజోషి, మనారాచోప్రా, సుభ్రాఅయ్యప్ప, హెబ్బాపటేల్, శివారెడ్డి, సుధీర్‌బాబు, దేవిశ్రీప్రసాద్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా కరీనా, సమంతలు అభిమానులను అలరించారు.
దుమ్మురేపిన హెబ్బా
డ్యాన్స్‌షోలతో హిరోయిన్ హెబ్బా పటేల్ దుమ్మురేపింది. కుర్రకారును తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించింది. అంతకుముందు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి మిమిక్రీతో నవ్వించాడు. సీఎంతో పాటు సీనిహీరోలను అనుకరిస్తూ ప్రేక్షకులను, అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ పాటలతో, డ్యాన్స్‌లతో అభిమానులకు ఊపునిచ్చాడు.

చిత్రాలు.. బాలీవుడ్ నటి కరీనాకపూర్‌కు స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం చేస్తున్న మంత్రి అఖిలప్రియ,
* తెలుగు సినీ పరిశ్రమ నుండి సమంతకు అవార్డు ప్రదానం చేస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు