ఆంధ్రప్రదేశ్‌

స్వైన్‌ఫ్లూ పట్ల ఆందోళన వద్దు: పూనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: స్వైన్‌ఫ్లూ వ్యాధిపట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టంచేశారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్న హెచ్1ఎన్1 వైరస్‌ను నియంత్రించ గలిగే మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున గత ఏడాది కంటే నాలుగు నెలలు ముందుగానే స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోందని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ 21 వరకు 223 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 37మంది స్వైన్‌ఫ్లూ బారినపడి ఆసుపత్రులలో చికి త్స పొందుతున్నారని వివరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులలో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 80 ప్రాంతాల్లో 352 పడకలు, 66 వెంటిలేటర్లు, అవసరమైన మందులు సిద్ధం చేశామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 11వేల 762 అవగాహన శిబిరాలు నిర్వహించామని, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో 4లక్షల 16వేల 565 మందికి రక్తపరీక్షలు నిర్వహించామన్నారు. ప్రతి గ్రామంలో చంద్రన్న సంచార చికిత్సా వాహనాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వరుసగా మూడురోజులు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే సమీపంలోని ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహించుకుని మందులు వాడాలని సూచించారు.