ఆంధ్రప్రదేశ్‌

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 10: రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీలు ప్రభుత్వం నుంచి ల్యాండ్ పూలింగ్ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీలు స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి పథంలోకి రావాలంటే ఈ ల్యాండ్ పూలింగ్ విధానం దోహదపడుతుందని అంటున్నారు. ఇంతవరకు అనధికార లేఅవుట్లలో తెలియక స్థలాలు కొనుక్కుని ఇంటి ప్లాన్ మంజూరు కాక ఇబ్బందులు పడుతూ మోసపోయిన అనధికార లేఅవుట్ బాధితులందరికీ మేలు చేసేందుకు గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (గుడా) ఛైర్మన్ గన్ని కృష్ణ చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తాజాగా జీవో తీసుకురావడంతో ఆ జీవో మార్గదర్శకాలు రాష్ట్రంలోని అన్ని అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీల్లోని అనధికార లే అవుట్ల బాధితులకు ప్రయోజనం చేకూర్చేదిగా మారిం ది. రాష్టవ్య్రాప్తంగా గుడా మార్గదర్శకమైంది. పూర్వం నుం చి అనధికార లేఅవుట్‌లో స్థలాలు కొనుకున్నవారిని దృష్టి లో పెట్టుకుని వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చాలని గుడా ప్రయత్నించింది. ప్రభుత్వంతో చర్చించడంతో 28028 జీవో సర్క్యులర్ జారీ అయింది. ఈ మేరకు అనధికార లే అవుట్లలో 60శాతం అభివృద్ధి జరిగి ఉంటే, 14 శాతం అభివృద్ధి చార్జీలు చెల్లించుకుని ఆయా లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తారు. దీంతో గుడా పరిధిలో ఇప్పటివరకు ప దుల సంఖ్యలో లేఅవుట్లను క్రమబద్ధీకరించడం జరిగింది. గుడా ప్రయత్నంతో సాధించిన ఈ జీవో కాస్తా రాష్ట్రంలోని అన్ని అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీలకు వర్తిస్తోంది. దీం తో అనధికార లేఅవుట్లు క్రమబద్ధీకరించడంతో పాటు మ రోవైపు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రధానంగా స్థలా లు కొనుక్కుని ఇంత కాలం మోసపోయిన కొనుగోలుదారులకు దారి దొరికినట్టయింది. ఇదిలా ఉండగా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కాస్తా ప్రణాళికాబద్ధ అభివృద్ధికి దోహదపడింది. ఆన్‌లైన్ లో ప్లాన్ మంజూరు వల్ల ఎక్కడా జాప్యం లేకుండా గడువులోగా అనుమతులు వచ్చేందుకు అవకాశం దక్కింది. ఈ విధానంలో అన్ని ధ్రువపత్రాలు సవ్యంగా ఉంటే కేవలం ఏడు రోజుల్లోనే ప్లాన్ మంజూరు లభించేందుకు అవకాశం ఉంది. ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలిసే విధంగా పారదర్శకంగా ప్లాన్ మంజూరుకు, అవకతవలకు తావులేని విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అనుమతుల్లో గుడా ముందుంది. గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ ప్రస్తుతం 290 గ్రామాల పరిధిలో 2150 స్క్వేర్ కిలో మీటర్ల పరిధిలో ఉంది. దీనికి అదనంగా మరో 860 స్వ్కేర్ కిలో మీటర్లు కలిపి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ చెప్పారు. కాకినాడ నుంచి విశాఖ వరకు సముద్ర తీరం వెంబడి ఉన్న పీసీపీఐఆర్ (పెట్రో కారిడార్ పెట్రో ఇన్‌ప్రాస్ట్రక్చర్ రీజియన్) ప్రాంతం కాస్తా విశాఖ అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ పరిధిలో భూభాగాన్ని ఇపుడు గుడా పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీసీపీఐఆర్ పరిధిలో గ్రామాల్లో ఎటువంటి అనుమతులు పొందాలన్నా విశాఖ పట్నం వెళ్లాల్సిందే. అలా కాకుండా గుడా పరిధిలోకి తెస్తే మరింత సరళతరమైన అభివృద్ధికి దోహద పడుతుందని గుడాలో విలీనం చేయాలని చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనితోపాటు తుని మున్సిపాలిటీ, రామచంద్రపురం, రావులపాలెం మండలాలను పూర్తిగా గుడా పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో నూతనంగా ఆవిర్భవించిన గుడా, నెల్లూరు నుడా, మచిలీపట్నం అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ, కర్నూలు కుడా, అనంతపురం అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీలు ల్యాండ్‌పూలింగ్ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్లంతా సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించారు. త్వరలో మార్గదర్శకాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు.