ఆంధ్రప్రదేశ్‌

70 మందితో బీజేపీ దళిత మోర్చా నూతన కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 10: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని స్థాయిల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిగా పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ అనుబంధ సంస్థలన్నింటికీ పూర్తిస్థాయిలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కిసాన్ మోర్చా, యువమోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా విభాగాలకు కార్యవర్గాలు ఏర్పాటు కాగా శనివారం 70 మందితో దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఇస్కా సునీల్‌కుమార్ శనివారం ప్రకటించారు. వీరిలో 14 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులు, నలుగురు మీడియా కోఆర్డినేటర్లు, ఐదుగురు యువ కార్యదర్శులు, 13 మంది మహిళా కోఆర్డినేటర్లు, ఐదుగురు సలహాదారులు నియమితులయ్యారు.