ఆంధ్రప్రదేశ్‌

14 నుంచి పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 10: వేతన సవరణ, తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2038 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో (పీఏసీఎస్‌లు) పని చేస్తున్న ఆరువేల మంది ఉద్యోగులు ఈ నెల 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నారు. ఈ సమ్మె సందర్భంగా తొలుత 12వ తేదీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ల ఎదుట ధర్నాలు, 14వ తేదీ నుంచి డీసీసీబీ బ్రాంచీలు, డివిజనల్ కార్యాలయాల ఎదుట సమ్మె శిబిరాలు, 19న ధర్నాలు, 26న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు, డిసెంబర్ 3 నుంచి విజయవాడలో రిలేదీక్షలు, 10న చలో విజయవాడ కార్యక్రమాలు జరుగుతాయని సీఐటీయు అనుబంధ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లారుూస్ యూనియన్ గౌరవాధ్యక్షులు పీ అజయ్‌కుమార్, అధ్యక్షులు పీవీ సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి వీ కృష్ణంరాజు శనివారం నాడిక్కడ తెలిపారు.