ఆంధ్రప్రదేశ్‌

గంజాయి సాగు నియంత్రణలో డ్రోన్‌ల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 10: విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును నియంత్రించేందుకు డ్రోన్‌లను వినియోగించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ పీ లక్ష్మీనరసింహం వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో ఎక్సైజ్, పోలీసు, ఐటీడీఏ, అటవీ అధికారులతో శనివారం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ శాటిలైట్ చిత్రాల ద్వారా గంజాయి సాగుజరుగుతున్న గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి దాడులు చేపట్టేవాళ్లమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గంజాయి సాగు, రవాణాలో విశాఖ జిల్లా కీలకంగా నిలుస్తోందని, గంజాయి సాగు నియంత్రించడం అనివార్యమని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లింగ్‌ను నియంత్రించాలంటే క్షేత్ర స్థాయిలో సాగును నిలువరించగలగాలని అన్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగును పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు గతేడాది నుంచి కార్యాచరణ చేపట్టామన్నారు. గతేడాది సెప్టెంబర్ 15 నుంచి 20 మధ్య చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో విశాఖ ఏజెన్సీలో 3,125 ఎకరాల్లో సాగుచేస్తున్న 1.69 కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. దీనికోసం శాటిలైట్ చిత్రాలతో పాటు అప్పటికే డ్రోన్ సాంకేతిక సహకారాన్ని తీసుకున్నామన్నారు. గతేడాది శాటిలైట్ చిత్రాల ఆధారంగా చేపట్టిన గంజాయి నియంత్రణ కార్యాచరణకు మంచి ఫలితాలు రావడంతో జాతీయంగా అభినందనలు వెల్లువెత్తాయన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది గంజాయిపై యుద్ధం కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ సారి డ్రోన్‌ల సహకారంతో సాగుపై యుద్ధం చేపట్టనున్నామన్నారు. ఇదే సందర్భంలో గంజాయి సాగుకు అమాయక గిరిజనులను మభ్యపెట్టి గంజాయి సాగులో భాగస్వామ్యం చేస్తున్న అక్రమార్కుల చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించడం ద్వారా వారు గంజాయి సాగు, రవాణాకు సహకరించకుండా నియంత్రించేందుకు కార్యచరణ చేపడుతున్నామన్నారు. డీఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ గంజాయి సాగు కారణంగా జిల్లాలో శాంతి భద్రతలకు సైతం తీవ్ర విఘాతమేర్పడుతోందని అన్నారు. ఇటీవల నక్కపల్లి టోల్‌ప్లాజా వద్ద తమిళనాడు మధురైకు చెందిన ఒక వ్యక్తిని కొంతమంది అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. చెన్నైకి చెందిన ఈ ముఠాలకు శ్రీలంక తదితర దేశాలతో సంబంధాలు ఉన్నాయని, విశాఖలో గంజాయి సాగు, అక్రమ రవాణా ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారుతోందన్నారు. సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పీసీసీఎఫ్ రాహుల్ పాండే, రూరల్ ఎస్పీ బాబూజీ అట్టాడ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం