రాష్ట్రీయం

టెక్నాలజీ అనుసంధానంతో కొత్త విధానాల రూపకల్పన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: టెక్నాలజీ అనుసంధానంతో పరిపాలనలో కొత్త విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. దుబాయ్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఎజైల్ గవర్నెన్స్‌పై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ టెక్నాలజీ అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పాలనలో మార్పులు రావాల్సి ఉందన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కాలానుగుణంగా ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని కొత్త విధానాలు, మార్పులు పాలనలో తీసుకురావాలన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం, టెక్నాలజీని వినియోగించుకుని ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ఏపీలో గవర్నెన్స్ 2.0 అమలు చేస్తున్నామని, ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. 10లక్షల ఐవోటీ పరికరాలు ఉపయోగిస్తున్నామని, రియల్ టైమ్‌లో మంచినీటి నాణ్యత, భూసార పరీక్షలు, రిజర్వాయర్లలో నీటి స్థాయి, భూగర్భ జలాల లభ్యత, వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటున్నామని వివరించారు. ఆర్టీజీలో భాగంగా ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ ద్వారా కాల్స్ చేస్తూ ప్రజల సంతోష సూచీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో సమాచారం అందరికీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. భూ వివరాలను డిజిటలైజ్ చేస్తున్నామని, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా రక్షణ కల్పిస్తున్నామన్నారు. డ్రోన్లు ఉపయోగించి రియల్ టైమ్‌లో భూపరీక్షలు నిర్వహించే టెక్నాలజీపై మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిపి పనిచేస్తున్నామన్నారు. రహదారుల నాణ్యతను లైడార్ టెక్నాలజీతో తెలుసుకుంటున్నామన్నారు. కాగిత రహిత పాలనపై దృష్టి సారించామన్నారు. అన్ని శాఖల్లో ముఖ్యమైన పనితీరు సూచికలు ఏర్పాటు చేసుకున్నామని, వీటిద్వారా శాఖల పనితీరు మరిం త మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని లోకేష్ వివరించారు.

చిత్రం..దుబాయ్ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్