ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగాన్ని, ప్రజాధనాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 11: రాజ్యాంగాన్ని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పైనే ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, గవర్నర్ దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలోప్రజాధనం దర్వినియోగంపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఒక హోటల్‌లో ఆదివారం ఆయన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అనంతరం జీవీఎల్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందో గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండటాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. టీడీపీ ప్రభుత్వం తన రాజకీయ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశదిమ్మరిగా సొంత వ్యాపారాల కోసం ప్రజాధనాన్ని వాడుకుంటున్నారన్నారు. పాల వ్యాపారంలో సీఎం చంద్రబాబు బాగానే సంపాదించారని, ఆ సొమ్మును తన రాజకీయ ఆవసరాల కోసం వాడుకోవాలని సూచించారు. ఆయన సొంత ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయిని వసూలు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి వెళ్లిపోతున్నారని, తరువాత దీనికి అధికారులే బాధ్యులవుతారని, వారు జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్న తీరుపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. టీడీపీ ఉనికి కోసమే చంద్రబాబు మహాకూటమి అంటూ హడావుడి చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు.
వెంటిలేటర్‌పై టీడీపీ ప్రభుత్వం
గుంటూరు: 2014లో టీడీపీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 600 హామీలు ఎటువైపు వెళ్లాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, చంద్రబాబును మరోసారి సీఎంగా ప్రజలు అంగీకరించడం లేదని, 2019లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధుల వరద పారిస్తే రాష్ట్భ్రావృద్ధికి కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రచారార్భాటాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రజలకు టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్