ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, నవంబర్ 11: రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళామోర్చా ఇంచార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఒకే వేదికపై చేరాయంటే మరోసారి ద్రోహం చేయడానికే అని అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆదివారం జరిగిన మహిళామోర్చా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించడమే గాక ఆర్థికంగా సాయం చేసిందన్నారు.
అయినా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారన్నారు. దేశంలో బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీల్లో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అందుకే అభివృద్ధి జరగడం లేదన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుకు తనయుడు లోకేశ్, సోనియాకు కుమారుడు రాహుల్‌గాంధీ... ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఇదే తరహా కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించినప్పుడు మోదీకి ఎవరు ఉన్నారన్న దానికి నా వెనుక 130 కోట్ల భారతీయులు ఉన్నారని చెప్పడం మనందరికి గర్వకారణమన్నారు. పేదలకు మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
మహిళలకు గుర్తింపునిచ్చింది ఒక్క బీజేపీయే అని అన్నారు. మహిళలకు గతంలో ప్రసవం అనంతరం సెలవు 3 నెలలు ఉంటే దాన్ని 9 నెలలకు మార్చారన్నారు. ఎర్రకోట ప్రసంగంలో స్వచ్ఛ్భారత్ పేరుతో ఇంటింటికి మరుగుదొడ్డి పథకాన్ని ప్రవేశపెడితే అందరూ నవ్వారని, కానీ ఈరోజు ఈ పథకం వల్ల మహిళల ఆత్మగౌరవాన్ని మోదీ నిలబెట్టారన్నారు. భారతదేశాన్ని అగ్రభాగంలో నిలిపిన మోదీకి ప్రపంచదేశాలు అభివాదం తెలుపుతున్నాయన్నారు. ఉజ్వల, జీవనజ్యోతి సంరక్షణ లాంటి పథకాలతో పాటు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మోదీ మరింత గౌరవం తీసుకువచ్చారన్నారు. దీంతో ముస్లిం మహిళలు మోదీకి అండగా నిలుస్తున్నారన్నారు. ముస్లిం మహిళల జీవితాలను కాపాడిన వ్యక్తిగా మోదీ గుర్తింపు పొందారన్నారు.

చిత్రం..మహిళామోర్చా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ మహిళామోర్చా ఇన్‌చార్జి పురంధ్రీశ్వరి