బిజినెస్

ఏపీతో కలిసి పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్స్ హైలెవెల్ ప్యానెల్ ఆన్ డిజిటల్ కో-ఆపరేషన్ ముందుకు వచ్చింది. దుబాయ్ పర్యటనలో భాగంగా హైలెవెల్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అమన్దీప్ ఎస్ గిల్‌తో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ సోమవారం భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, టెక్నాలజీ సహకారంతో పాలనలో తీసుకువస్తున్న మార్పుల గురించి వివరించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు, సహకారం అందించేందుకు గిల్ ముందుకు వచ్చారు. టోనీ బ్లేయర్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ అబ్దుల్లాతో కూడా మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో టెక్నాలజీతో జరుగుతున్న అభివృద్ధి తదితర అంశాల గురించి వివరించారు. దీనిపై అబ్దుల్లా స్పందిస్తూ, వచ్చే సంవత్సరం బ్లేయర్ ఏపీకి వస్తారని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

చిత్రం..దుబాయ్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్