ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్యకర వాతావరణానికి ప్రకృతి వ్యవసాయమే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 12: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు ఎంతోమేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. విదేశాలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ సోమవారం పారిస్‌లోని పీస్ ఫోరంలో పాల్గొన్న 116 దేశాల ప్రతినిధుల గ్రూపు డిస్కషన్ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు. పంటలకు అవసరమయ్యే ఎరువులు, మందులు నామమాత్రపు ఖర్చుతో తయారు చేసుకోవడం ద్వారా ఎకరాకు రూ.5వేల వరకు అదనంగా ఆదాయం లభిస్తుందన్నారు. ఈ వ్యవసాయంలో జీవామృతం, బీజామృతం, అచ్చాదన తదితర పద్ధతుల్లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, జీడి, మామిడి తదితర పంటలను సాగు చేయవచ్చన్నారు. విజయనగరం జిల్లాలో 8370 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా కూరగాయలు, ఉలవలు, అలసందలు ఇతర అంతర పంటలను పండించడం వల్ల వ్యవసాయ ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పౌష్టికాహారం అందడంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, భూసారం పెరుగుతుందని కలెక్టర్ వివరించారు.

చిత్రం..పారిస్ పీస్ ఫోరంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరి జవహర్‌లాల్