ఆంధ్రప్రదేశ్‌

పోలీసు శాఖలో 3137 పోస్టులకు నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి రాష్టస్ధ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. మొత్తం 3137 ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నట్లు డీజీపీ ఆర్‌పి ఠాకూర్ తెలిపారు. ఇప్పటికే సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈనెల 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించగా ఇప్పటి వరకు 21వేల అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. గత ఏడాది మాదిరిగానే పోలీసు ఉద్యోగాల నియామక రాతపరీక్ష కాకినాడ జెఎన్‌టియునే నిర్వహిస్తోందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ షెడ్యూల్‌ను సోమవారం డీజీపీ విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ వరకు ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. సివిల్, రిజర్వు, ఏపిఎస్‌పి విభగాల్లో ఎస్‌ఐ ఉద్యోగాలకు 21 నుంచి 25 ఏళ్ళ వరకు వయోపరిమితి, డిప్యూటీ జైలర్ పోస్టులకు 21 నుంచి 30ఏళ్ళు, డిప్యూటీ మహిళ జైలర్ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్ళు, అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు 18నుంచి 30ఏళ్ళుగా వయోపరిమితి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఐదేళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్‌సిసి, ఆర్మీ, ఎయిర్‌ఫోర్సు విభాగాల్లో పని చేసిన వారికి మూడేళ్లు సడలింపు ఉందన్నారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా వీరందరికీ డిగ్రీని అర్హతగా నిర్ణయించామని, ఎస్‌ఐ స్ధాయి ఉద్యోగాలకు డిసెంబర్ డిసెంబర్ 16న రాతపరీక్ష, జనవరిలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించడంతోపాటు ఫిబ్రవరి మొదటి వారంలో తుది పరీక్ష ఉంటుందని ఎంపికైన వారికి మార్చిలో ట్రైనింగ్‌కు పంపుతామన్నారు.
2723 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ
ఇదిలావుండగా 2723 కానిస్టేబుల్ ఖాళీల భర్తీ కోసం అభ్యర్ధులు ఇప్పటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వయస్సు 18 నుంచి 22 ఏళ్లుగా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, బిసీలకు ఐదేళ్ళు, ఆర్మీ, ఎన్‌సిసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్ళు సడలింపు ఉంటుందన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్ విద్యార్హత కాగా, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పదో తరగతి సరిపోతుందని, వార్డర్ పోస్టులకు ఇంటర్ విద్యార్హతగా నిర్ణయించామన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 6న రాత పరీక్ష నిర్వహించడంతోపాటు ఫిబ్రవరి రెండోవారంలో దేహదారుఢ్య, ఇతర పోటీలు ఉంటామని, మార్చి మొదటి వారంలో తుది పరీక్ష నిర్వహించి ఏప్రిల్‌లో శిక్షణకు పంపుతామన్నారు.
రాష్టవ్య్రాప్తంగా పోలీసు కానిస్టేబుళ్ళకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నట్లు డీజీపీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రభుత్వం వద్ద చివరిదశలో ఉందని తెలిపారు.
రెండువేల మందికి పైగా కానిస్టేబుళ్ళకు త్వరలో పదోన్నతులు కలుగనున్నాయన్నారు. విలేఖరుల సమావేశంలో రాష్టస్ధ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ పాల్గొన్నారు.