ఆంధ్రప్రదేశ్‌

మహిళల ద్వారానే సమాజంలో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 20: మహిళల ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన కాగా, అందుకు సమర్థులు కమ్యూనిటీ రిసోర్స్ పర్సనే్ల(సీఆర్పీ)నని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలో జరిగిన మెప్మా రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కరికాల వలవన్ మాట్లాడుతూ ఒక్కో సీఆర్పీపై మూడు వేల మంది ప్రజల భవిష్యత్తు ఆధారపడిఉందన్నారు. ఒక మహిళ కుటుంబాన్ని సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహిస్తుందో అదే బాధ్యతతో సీఆర్పీలు వారి పరిధిలోని సంఘ సభ్యులతోపాటు సమాజంలోని ప్రజల బాగోగులను సంరక్షించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను, స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు ఆయా పథకాలపై అవగాహన కల్పించి సద్వినియోగం చేయాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది పట్టణ పేద మహిళలకు చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో శిక్షణ ద్వారా తెలపాలని సీఆర్పీలకు సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో వివరిస్తామన్నారు. హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వాటి ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు అందేలా క్షేత్రస్థాయిలో విధులను సమర్ధవంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.
సీఆర్పీలపైనే ముఖ్యమంత్రికి నమ్మకం
మెప్మా డైరెక్టర్ కె కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల చేరువ చేసేందుకు సీఆర్పీలు వారధిగా ఉండాలన్నారు. ఉద్యోగుల కంటే సీఆర్‌పీల పనితనంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన నమ్మకం ఉందన్నారు. పురసేవ యాప్ ద్వారా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను ఇంటి వద్ద నుంచే పొందడం సాధ్యమవుతోందని, ప్రతి సీఆర్పీ మరో 100 మందిచేత పుర యాప్‌ను వినియోగించేలా శిక్షణ నివ్వాలన్నారు. సీఆర్పీల పనితీరు ఆధారంగా తగు ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 110 మున్సిపాలిటీలకు చెందిన 1350 మంది సీఆర్పీలు పాల్గొన్నారు.