ఆంధ్రప్రదేశ్‌

గంజాయి సాగుపై డ్రోన్ల డేగకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: విశాఖ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారుల కళ్లు కప్పి, దట్టమైన అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగుతున్న గంజాయి సాగును అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్ నిఘా కళ్లతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. డ్రోన్లను ఉపయోగించిన ఆర్టీజీఎస్ గంజాయి తోటలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచుంగిపుట్ మండలాల్లో గంజాయి సాగు జోరుగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అధికార యంత్రాంగం దృష్టికి రాకుండా వందలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
ఎతె్తైన కొండ ప్రాంతాల్లో ఎవరూ వచ్చేందుకు వీలు లేని ప్రాంతాలను ఎంచుకుని ఈ తోటలను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోటలను డ్రోన్ల సాయంతో గుర్తించి, అక్కడకు వెళ్లి తోటలను ధ్వంసం చేసేందుకు వీలుగా ఆర్టీజీఎస్ చర్యలు తీసుకుంటోంది. ఇకపై గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగుపై నిరంతరం డ్రోన్ల సాయంతో నిఘా ఉంచనున్నారు. ఇందులో భాగంగా ఎక్సైజ్, పోలీసు శాఖకు ఆర్టీజీఎస్ సహకారం అందించనుంది. అనుమానిత ప్రాంతాల్లో గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే గంజాయి తోటలను ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభించారు. స్థానికుల సహకారం తీసుకుని, నిఘా వ్యవస్థ మరింత మెరుగుపరిచి, డ్రోన్ల సర్వేతో గంజాయి తోటల సాగు పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చిత్రం..విశాఖ ఏజెన్సీలో కొండలపై సాగవుతున్న గంజాయి తోటలు