ఆంధ్రప్రదేశ్‌

టీడీపీతో పొత్తుపై ఎలాంటి సంకేతాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాల్లేవని, ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడమే ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయమని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిఅన్నారు. పొత్తు విషయమై డిసెంబర్ 15వ తేదీ నాటికి అధిష్ఠానం నుంచి తగిన ఆదేశాలు వస్తాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఒక హోటల్‌లో ఆయన చిత్తూరు, కర్నూలు, కడప నియోజక వర్గాల సమన్వకర్తలు, ఏఐసీసీ, పీసీసీ కార్యవర్గ సభ్యుల సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంతో దేశాభివృద్ధికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాహూల్ గాంధీని కలిశారన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ మిత్రపక్షంగా ఉంటుందా లేదా అన్నది తమకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 12వ తేదీ ఫలితాలు వెలువడిన తరువాత 15 లోపు తమ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. దేశంలో జరిగిన నాలుగు సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీకి 69 శాతం నుంచి 90శాతం వరకు సానుకూల ఫలితాలు వస్తాయని వెల్లడయ్యాయన్నారు. యావరేజ్‌గా 72శాతం ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నట్లు స్పష్టంగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు. ఇది 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ అన్నారు. ఈ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణలో అధికార పార్టీ బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తోందన్నారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి సీటు బీజేపీకే వెళుతుందన్నారు. ఈక్రమంలోనే వైకాపా, జనసేన పార్టీలు పోటీ చేయడం లేదన్నారు. ఇందుకు కారణం మోదీకి ఈ రెండు పార్టీలు ఏజెంట్లుగా మారడమేనన్నారు. తెలంగాణలో పోటీకి సమయం లేదని తప్పించుకున్న జనసేన, వైకాపా పార్లమెంటుకు పోటీ చేస్తామనడం హాస్యాస్పదం అన్నారు. వారి పరిస్థితి ఉట్టికెక్కలేని అమ్మ... స్వర్గానికి ఎక్కినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే బీజేపీని జగన్, పవన్ పార్టీలు సమర్థిస్తున్నాయన్నారు. బీజేపీకి మద్దతు పలకడం ద్వారా ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నారా అని వైకాపా, జనసేన నేతలను ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు పాల్పడినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి