ఆంధ్రప్రదేశ్‌

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను 2023 నాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, నవంబర్ 20: దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను పనులు 2023 నాటికి పూర్తిచేయడానికి ప్రణాళికలు రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే లైను ఏర్పాటులో భాగంగా గోదావరి నదిపై మూడు ప్రధాన వంతెనలు నిర్మించవలసి ఉందన్నారు. ఈ వంతెనల నిర్మాణానికి టెండర్ల ప్రకియ పూర్తయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్ధల సేకరణ చేసి తమకు అప్పగిస్తే పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు. విజయవాడ-్భమవరం డబ్లింగ్ పనులు 2021 నాటికి పూర్తిచేసేవిధంగా పనులు వేగవంతం చేశామన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని గుడివాడ-నరసాపురం మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులను మంగళవారం జీఎం వినోద్‌కుమార్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా నరసాపురం, భీమవరం రైల్వే స్టేషన్లను సందర్శించి, ఫిట్‌లైను, రిజర్వేషన్ కౌంటర్, ప్లాట్‌ఫాం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా వినోద్‌కుమార్ యాదవ్ విలేఖరులతో మాట్లాడారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో చేపట్టిన రైల్వే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు 2021 నాటికి పూర్తిచేస్తామన్నారు. దీనిలో భాగంగా ఆకివీడు- గుడివాడ మార్గంలో 40 కిలోమీటర్ల మేర రైల్వే లైను డబ్లింగ్ పనులు 2019 మార్చి నాటికి పూర్తిచేసి రైళ్ళ రాకపోకలు అనుమతించేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ అపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎన్.గుణశేఖర్, పలు విభాగాల ఉన్నతాధికారులున్నారు.

చిత్రం..దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్
యాదవ్‌ను సత్కరిస్తున్న నరసాపురం ఎంపీ గంగరాజు