ఆంధ్రప్రదేశ్‌

27 తరువాత స్పందిస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వాంగ్మూలం కోరుతూ సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద జారీ చేసిన నోటీసులపై ఈ నెల 27 తరువాత స్పందిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. ఘటనపై జగన్ వాంగ్మూలాన్ని ఈ నెల 23లోగా ఇవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. తనపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థచే దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతున్నట్టు వెల్లడించారు.
ఇప్పటికే ఈ అంశంపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుందన్నారు. 27న హైకోర్టు నుంచి వెలువడే తీర్పు అనంతరం తాను వాంగ్మూలం ఇచ్చే అంశంపై స్పందిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖను ఆ పార్టీ విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ తదితరులు సిట్ దర్యాప్తు అధికారి నాగేశ్వర రావుకు బుధవారం అందజేశారు. ఇదే సందర్భంలో నగర వైసీపీ అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్‌కు కూడా సిట్ సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం వాంగ్మూలం కోరుతూ నోటీసులు జారీ చేయగా, తాను త్వరలోనే స్పందిస్తానని వెల్లడించారు.