ఆంధ్రప్రదేశ్‌

పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రిహార్సల్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 26: రెండు వారాల వ్యవధిలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి ఈ నెల 29న పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 300కిలోల ప్రధాన ఉపగ్రహం హైసిస్, న్యూఢిల్లీ యూనివర్సిటి రూపొందించిన మరో బుల్లి ఉపగ్రహంతో పాటు 8దేశాలకు చెందిన విదేశీ 29 ఉపగ్రహాలను ఒకేసారి పోలార్ శాటిలైట్ లాంచ్ వాహక నౌక ద్వారా రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్) సోమవారం శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్లో భాగంగా శాస్తవ్రేత్తలు రాకెట్‌ను ఎంఎస్‌టి టవర్ నుంచి ముందుకు తీసుకెళ్లి మళ్లీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం మంగళవారం షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఏబి) సమావేశమై చర్చించనంతరం ప్రయోగానికి సంసిద్ధత ఇవ్వనున్నారు. భూ పరిశీలన నిమిత్తం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి పంపుతున్నారు. ఈ ఉపగ్రహంలో మల్టీస్పెక్చల్ ఇమేజింగ్ కెమెరాను అమర్చి ఉన్నారు. ఈ కెమెరా కంటికి కనబడని రేణువు వంటి వాటిని కూడా స్పష్టంగా ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఈ నెల 29న గురువారం ఉదయం 9:57గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. కౌంట్‌డౌన్ ప్రయోగానికి 28గంటలు ముందు అనగా 28న ఉదయం 5:58గంటలకు ప్రారంభించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి శిఖర భాగన ఉపగ్రహాలను అమర్చి ప్రయోగానికి సిద్ధం చేశారు. రెండు వారాల వ్యవధిలోనే ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం కావడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్ ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాలను పంపించేందుకు ఇస్రో సన్నద్దమైంది.

చిత్రాలు.. పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్,* హైసిస్ ప్రధాన ఉపగ్రహం