ఆంధ్రప్రదేశ్‌

ఈసారి అనంతలో ఆగస్ట్ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అనంతపురం వేదిక కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం స్వాతంత్య్ర వేడుకలను సొంత రాష్ట్రంలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చందబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలుత కర్నూలులో, రెండోసారి విజయవాడలో ఉత్సవాలు నిర్వహించారు. ఈసారి అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కోన శశిధర్ ఇతర జిల్లా అధికారులతో కలిసి నగరంలోని పిటిసి (పోలీసు ట్రైనింగ్ కాలేజీ) స్టేడియాన్ని సందర్శించారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, పిటిసి ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఇతర అధికారులతో కలిసి స్టేడియం పరిస్థితి, వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతపురం నగరంలో రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే అవకాశం రావడం చారిత్రక అదృష్టమని కలెక్టర్ అన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాన వేదికతోపాటు ప్రజలు కూర్చునేందుకు గ్యాలరీలు, వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిపై నిర్వహించే శకటాల ప్రదర్శన, వివి ఐపిలు, విఐపిల గ్యాలరీలు, మీడియా పాయింట్లు, ఇతరత్రా సౌకర్యాలతో పాటు ఏ ఒక్కటీ లోటురాకుండా చూడాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.