బిజినెస్

సిడ్నీ నగరానికి చివరి మెట్రో రైలు తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, డిసెంబర్ 6: చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటైన శ్రీసిటీ పారిశ్రామికవాడలోని ఆల్‌స్టాం ట్రాన్స్‌పోర్ట్ పరిశ్రమలో తయారుచేసిన మెట్రో రైలును విజయవంతంగా ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరానికి తరలించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు జెండా ఊపి లాంఛనంగా తరలించారు. మెట్రో బోగీలు తయారుచేసే ఆల్‌స్ట్రాం కంపెనీ 2014లో పొందిన ఒప్పందం ప్రకారం 22 ఆరు బోగీల మెట్రో రైలు తయారీలో భాగంగా ఆఖరి మెట్రో రైలును సిడ్నీ నగరానికి తరలించారు. ఈ సందర్భంగా ఆల్‌స్టాం కంపెనీ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ ఎలైన్ స్పోర్ మాట్లాడుతూ ఆల్‌స్టాం పరిశ్రమ నుంచి 22 మెట్రో రైళ్లను తయారుచేయడమే కాకుండా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి తరలించడం తమకు గర్వంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు భారతదేశంలోని లక్నో, కొచ్చిన్, చెన్నైలకు మెట్రో రైళ్లను అందించామని, సంవత్సరానికి 200 బోగీలు తయారుచేసే సామర్ధ్యం ఆల్‌స్టాం ట్రాన్స్‌పోర్ట్‌కు ఉందని తెలిపారు.
అదేవిధంగా ఆల్‌స్టాం పరిశ్రమ ఇంతటి ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి శ్రీసిటీ ప్రధాన కారణమని, ఇక్కడ కావల్సిన అన్ని వౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆల్‌స్టాం పరిశ్రమలో మెట్రో తయారీ విభాగాన్ని మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌స్టాం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లింగ్‌పాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్‌క్సోన్, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..శ్రీసిటీలోని ఆల్‌స్టాం పరిశ్రమలో తయారైన మెట్రో రైలును ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి తరలిస్తున్న దృశ్యం