ఆంధ్రప్రదేశ్‌

వాళ్ల బిడ్డల భవిష్యత్ కోసమే రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు: రాజకీయ నాయకులు వాళ్ల బిడ్డల భవిష్యత్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టించుకునే స్థితిలో లేవన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని స్పిన్నింగ్‌మిల్లు వద్ద గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కవాతు రాజకీయ పార్టీలు చేయవని, కేవలం సైన్యం మాత్రమే చేస్తుందన్నారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు ప్రజలకు అండగా మేమున్నామంటూ సైన్యం, పోలీసులు కవాతు నిర్వహిస్తారన్నారు. జిల్లా రైతులకు అండగా నిలబడటానికే జనసేన కవాతు నిర్వహించిందన్నారు. విభజన అనంతరం దాదాపు పాతికేళ్ల భవిష్యత్‌ను ప్రజలకు అందించాల్సిన అధికార పార్టీ వారి సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని అంతమొందించడానికే జనసేనను స్థాపించామన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీల వద్ద ఉన్నట్లు వేల కోట్లు జనసేన వద్ద లేవన్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానం వుందన్నారు. మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి చేస్తానని ఓ పక్క చంద్రబాబు, ఒక్కసారి సీఎంగా అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామని మరోపక్క జగన్ ప్రకటిస్తున్నారన్నారు. ఇప్పటివరకు రాయలసీమకు చెందిన వారే ముఖ్యమంత్రిగా ఉన్నారని, అయినా ఈ ప్రాంతం రాళ్లసీమగా మారిందన్నారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారని, మీ వ్యక్తిగత జీవితాలను విప్పగలను గుర్తుంచుకోండి అని ఘాటుగా స్పందించారు. అయితే తన తల్లి అలాంటి సంస్కారం నేర్పలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తి దాడి జరిగినపుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయమ్మపై నిందలు మోపుతూ విమర్శలు చేశారన్నారు. వారి విమర్శలపై తాను స్పందించానని, విజయమ్మకు అండగా నిలిచానన్నారు. మహిళలను గౌరవించడం తన సంస్కృతి అని అన్నారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వల్ల అవినీతి జరిగిందా, రాష్ట్ర విభజన జరిగిందా అని ప్రశ్నించారు.
కరవుపై అసెంబ్లీలో పోరాడండి
అనంతపురం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం మాని, అనంతపురం జిల్లా కరువుపై పోరాటం చేయాలని, అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని జనసేనాని పవన్ కల్యాణ్ హితవు పలికారు. అనంతపురం నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనసేన అసలుప్రతిపక్షమే కాదని జగన్ అన్నారని, అయితే ఒక పార్టీగా అయినా గుర్తించారని, అదే ఆనందమని అన్నారు. తమను పార్టీగా వైకాపా నేతలు గుర్తించాల్సిన అవసరం లేదని, ప్రజలే గుర్తించారని అన్నారు. మీరు సమస్యల్ని గుర్తిస్తే చాలని అన్నారు. గతంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు చంద్రబాబు కొన్నారన్నారు. ఎమ్మెల్యేలను కొనడం నీచమైన పని అని విమర్శించారు. దశాబ్దాల కాలంగా ఈ నీచ సంస్కృతి కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొన్నారని మీరు పంతానికి పోయి అసెంబ్లీకి వెళ్లం అంటే ఎలా, పంతాలు, పట్టింపులకు ఇదేం సినిమా కాదు.. జగన్ ఒక్కడే అసెంబ్లీకి వెళ్లి కరువు, ప్రజాసమస్యలపై పోరాడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో స్పష్టం చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. బలం ఉన్న చోట మాత్రమే కాదని, బలం లేకపోయినా పోటీకి దిగుతామని స్పష్టం చేశారు. తద్వారా తమ పార్టీ బలమేమిటో తెలుసుకుంటామన్నారు. జనసేన పార్టీలో యువతకు అవకాశం ఇస్తామన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పని చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడని, చంద్రబాబు కూడా జనసేనతో పనిలేకుండా సీఎం అయ్యేవాడని అన్నారు. రావెల జనసేన పార్టీలో చేరినపుడు ఎమ్మెల్యే పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చారన్నారు. అంబేద్కర్‌కు దండలు వేయడం కాదు.. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గుంతకల్లు సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్