ఆంధ్రప్రదేశ్‌

సోలార్ పంపుసెట్ల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 7: దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ సంస్థగా ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రైతులకు విశిష్ఠ సేవలందిస్తూ అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను అధ్యయనం చేసేందుకు హర్యానా ప్రభుత్వ ప్రతినిధుల బృందం శుక్రవారం ఏపీఈపీడీసీఎల్‌కు చేరుకుంది. హర్యానా ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ, న్యూ రెన్యువబుల్ ఇంజనీర్ డిపార్ట్‌మెంట్, పవర్ డిపార్ట్‌మెంట్, పవర్ డిపార్ట్‌మెంట్ వారి నేతృత్వంలో హర్యానాప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ (పవర్ డిపార్ట్‌మెంట్) ప్రాతినిధ్య సభ్యులుగా పీకె దాస్, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ హరెదా జగ్జీత్‌సింగ్ కోహ్లి, సైంటిఫిక్ ఇంజనీర్ ‘ఏ’ పికె నాతియల్, (హరేదా) ప్రతినిధుల బృందం వచ్చింది. గ్రిడ్ కనెక్టెడ్ బీఎల్‌డీసి సోలార్ పంపుసెట్ల అధ్యయనంలో భాగంగా సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ బృందానికి ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మైనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర స్వాగతం పలికారు. తొలుత సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో గ్రిడ్ అనుంధానిత సోలార్ పంపుసెట్లకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ సీఎండి హెచ్‌వై దొర ఈ బృందానికి వివరించారు. ఈ బృందాన్ని విజయనగరం జిల్లాలోని సవరవల్లి, కవులవాడ గ్రామాలకు తీసుకువెళ్ళి ఈ పైలెట్ ప్రాజెక్ట్ పనితీరును వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీఈపీడీసీఎల్ ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా సవరవిల్లి ఫీడర్ పరిధిలో గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పంపుసెట్లను 216 వరకు ఏర్పాటు చేసామన్నారు. రైతులకు ఇప్పటి వరకు 3హెచ్‌పీ, 5హెచ్‌పీ పంపుసెట్లను ఐదేళ్ళ ఉచిత మెయింటినెన్స్‌తో ఏర్పాటు చేసామన్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రైతులు తమ వ్యవసాయానికి సరిపడినంత వినియోగించుకుని మిగులు విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు అమ్ముకోవచ్చన్నారు. వీటి నుండి ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది? ఎంత వినియోగించిందీ, అక్కడే అమర్చిన మీటర్‌ల్లో నమోదు అవుతుందన్నారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రైతులు అదనంగా ఆదాయం లభిస్తుందన్నారు. వారు వాడుకుని మిగిలిన విద్యుత్‌ను ఏ విధంగా గ్రిడ్‌కు అనుసంధానిస్తూ విక్రయించి తగిన ఆదాయాన్ని పొందుతున్న విధానాన్ని ఈ బృందానికి వివరించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైనందున ఏడు హెచ్‌పీ నుంచి పది హెచ్‌పీ కెపాసిటీ కలిగిన పదివేల పంపుసెట్లను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బృందం రైతులతో స్వయంగా మాట్లాడి వారి సంతృప్తిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ బొడ్డు శేషుకుమార్, చీఫ్ జనరల్ మేనేజర్ జీ.శరత్‌కుమార్, సోలార్ జనరల్ మేనేజర్ డి.సుమన్‌కళ్యాణి, డివిజనల్ ఇంజనీర్ యస్.నాగేశ్వరరావు, విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.విష్ణు, అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సోలార్ పంపుసెట్ల పనితీరును హర్యానా బృందానికి వివరిస్తున్న ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర