ఆంధ్రప్రదేశ్‌

కరవు సాయం అందేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కరవు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ తగు సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నీరజ అడిదాస్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల బృందం కరవు పరిస్థితులను అధ్యయనం చేసి వచ్చింది. అనంతరం వెలగపూడి సచివాలయంలో సీఎస్‌తో ఆ బృందం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో 2013 నుంచి వరుసగా కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరవు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు నెలవైన వింత పరిస్థితి ఏపీలో నెలకొందన్నారు. తక్కువ వర్షపాతం కారణంగా కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజలను, రైతులను కరవు పరిస్థితుల కాపాడేందుకు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇచ్చాయన్నారు. కరవు ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు, రేషన్, పింఛన్లు పంపిణీ, వైద్య సేవలు వంటివి చేపట్టామన్నారు. మైక్రో ఇరిగేషన్, నీటి కుంటల తవ్వకం, చెరువుల ద్వారా సాగునీరు సరఫరా వంటి చర్యలు త్వరగా కరవు కోరల నుంచి బయటపడేందుకు దోహదపడ్డాయన్నారు. కరవు సహాయ చర్యలపై కేంద్రం నుంచి 1401 కోట్ల రూపాయలు అదనంగా సాయం అందించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నదుల అనుసంధాన ప్రక్రియ అమలు చేస్తోందన్నారు. 90 శాతం మేర వ్యవసాయానికి కాలువల ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం వల్ల కరవు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన నీరజ మాట్లాడుతూ మూడు బృందాలుగా విడివడి ఆయా జిల్లాల్లో కరవు పరిస్థితులను అధ్యయనం చేశామన్నారు. అధికారులు, రైతులు, ప్రజలతో సమావేశమయ్యామని తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి, వేరుశనగ, పత్తి, బత్తాయి, నిమ్మ వంటి పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడటం గమనించామన్నారు. ఎండిన చెరువులు, రిజర్వాయర్లను కూడా పరిశీలించామని తెలిపారు. బీమా మొత్తం కట్టినా, ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కింద పరిహారం అందలేదని కొంతమంది రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. నివేదికను అందచేసి తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కరవు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. 9 జిల్లాల్లో 347 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.