ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని ఆర్టీసీ వేతన సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: ఏపీఎస్ ఆర్టీసీ వేతన సవరణ కమిటీ సమావేశం శుక్రవారం ఎటూ తేలకుండానే వాయిదా పడింది. ఆర్టీసీ సిబ్బందికి 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నాల్గవదఫాగా శుక్రవారం వేతన కమిటీ సమావేశం ఆర్టీసీ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరైయ్యారు. అలాగే ఎంప్లాయిస్ యూనియన్ తరపున వర్కింగ్ ప్రెసిడెండ్ హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, ఉప ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్, కార్యదర్శి ఎం.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ మేరకు వేతనాలు పెంచాలనే విషయం పై అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. సమావేశంలో కొద్దిసేపు ఘర్షణ తరహా వాతావరణం నెలకొంది. చివరకు ఎటూ తేల్చకుండానే సమావేశం ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.