ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి కర్నూలులో ఇస్తెమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 7: కర్నూలు నగర శివార్లలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ముస్లింలు ఇస్తెమా నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఇస్తెమా కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం నన్నూర్ టోల్‌ప్లాజా వద్ద ఇస్తెమా నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన హజరత్ వౌలానాసాద్ సాహెబ్ పాల్గొని ప్రార్థనలు చేస్తారు. గతంలో ఔరంగబాద్‌లో అతిపెద్ద ఇస్తెమా నిర్వహించారు. ఈసారి రెండవ అతిపెద్ద ఇస్తెమా కర్నూలు శివార్లలో జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి 1500 మంది మతపెద్దలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. 856 ఏకరాల్లో నిర్వహిస్తున్న ఇస్తెమాకు ప్రభుత్వం రూ.9.85 కోట్లు మంజూరుచేసింది. సుమారు 15 లక్షల మంది ముస్లింలు ఇస్తెమాకు హాజరవుతారని భావిస్తున్నారు. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి కర్నూలుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. 3 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు సైతం నడుపనున్నారు.