ఆంధ్రప్రదేశ్‌

సుప్రీం తీర్పు రాజకీయ పార్టీలకు కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 7: రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. బీసీలుగా రిజర్వేషన్లు పొందాలంటే సామాజిక వెనుకబాటుతనంతో పాటు వివక్షతకు గురైన వారు, సంచార జాతులు మాత్రమే అర్హులని తెలిసినా కొన్ని రాష్ట్రాల్లో అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, చట్టంలో పొందుపర్చిన విధంగానే రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. చట్టసభల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ 50 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీల నేతలు వాస్తవాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మండల కమిషన్ సిఫారసులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను పెంచాల్సి ఉండగా ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. బీసీ అధ్యయన కమిటీ జయహో బీసీ, బీసీల గర్జన అంటూ వివిధ రాజకీయ పార్టీలు మరోమారు బీసీలను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పడం వారిని మోసగించడమేనన్నారు. కాపులు, బీసీలకు మధ్య అఘాథాన్ని పెంచే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. అమలుకాని వాగ్దానాలను రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేర్చడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సంఘ నేతలు కుమ్మరి క్రాంతికుమార్, కన్న మాస్టారు, కోలా మణికంఠ పాల్గొన్నారు.