ఆంధ్రప్రదేశ్‌

దొనకొండలో వైమానిక శిక్షణ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 7: విమానయానానికి సంబంధించిన శిక్షణ, పరిశోధన కోసం ఒక సంస్థను ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. డ్రోన్‌ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలని సూచించారు. అమెరికా కేంద్రంగా ఎన్ 3 ఎం సొల్యూషన్స్ సంస్థ నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్ మహేష్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సంయుక్తంగా రూపొందించిన లాంగ్ రేంజ్ డ్రోన్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌తో కలసి ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్ ఒకే సారి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించ గలదు. ఏడున్నర గంటల పాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్‌ను వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించు కోవచ్చని వెల్లడించారు. 15 కిలోల బరువు కలిగిన ఈ డ్రోన్‌కు 25 కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉంటుది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. మరింత అభివృద్ధిచేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈఒ కె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..ఎస్ 3 ఎం సంస్థ రూపొందించిన లాంగ్ రేంజ్ డ్రోన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు