ఆంధ్రప్రదేశ్‌

18 నుంచి దేశ వ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ఈ నెల 18వ తేదీ నుండి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ్రామీణ తపాలా ఉద్యోగులు దేశ వ్యాప్త నిరవధిక సమ్మెకు దిగుతున్నామని శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నేతలు తెలిపారు. 2016 నవంబర్‌లో వేతనాలపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించగా రెండేళ్లు నాన్చి, 2018, ఆగస్టులో 16 రోజులు సమ్మె చేసిన దరిమిలా ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి డిపార్ట్‌మెంట్‌కు పంపించిందన్నారు. దీనిలో అన్నీ కోతలు పెట్టి అమలు చేశారన్నారు. సీనియర్లు, జూనియర్లకి తేడా లేకుండా ఒకే విధంగా వేతనాలు ఇస్తూ తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు బీవీ రావు, రాష్ట్ర అధ్యక్షులు దోమా రఘుబాము, డివిజనల్ కార్యదర్శి బీ వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కే రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.