ఆంధ్రప్రదేశ్‌

గాయని బేబీకి ప్రోత్సాహం అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 8: వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ సంగీతంలో శిక్షణ లేకున్నా అలవోకగా, శ్రావ్యంగా సినీ పాటలను ఆలపించి సోషల్ మీడియాలో గుర్తింపు సాధించిన గాయని బేబీకి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బేబీని పరిచయం చేసి పరిస్థితిని వివరించారు. సినీ నేపథ్య గాయకుల స్థాయిలో పాడగల నేర్పు బేబీకి ఉందని ఎంపీ మురళీమోహన్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వడిసలేరు గ్రామానికి చెందిన బేబీ గత కొద్దికాలంగా సినీ పాటలను ఒకసారి విని అనర్గళంగా పాడటం యూ ట్యూబ్ ద్వారా అందరి ప్రశంసలు అందుకోవటంతో పాటు చలనచిత్ర సంగీత దర్శకులు కీరవాణి, ఏఆర్ రెహ్మాన్ లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది. ఆన్‌లైన్‌లో తనదైన శైలిలో లక్షలాది మంది శ్రోతలను అలరింప చేస్తున్న బేబీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సత్కరించారు. బేబీ ప్రతిభను గుర్తించి ఇతరత్రా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..గాయని బేబీని అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు