ఆంధ్రప్రదేశ్‌

చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహ్మద్‌కు ‘మాటిరతన్’ జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: చరిత్రకారుడు, సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నశీర్ అహ్మద్‌కు ‘మాటిరతన్’ జాతీయ పురస్కారం లభించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుడు అష్ఫాఖుల్లా ఖాన్‌ను ఉరితీసిన ఫైజాబాద్ జైలులో ఈ నెల 19న జరిగే అష్ఫాఖుల్లా ఖాన్ స్మార క స్వర్ణోత్సవాల సందర్భంగా నశీర్ అహ్మద్‌ను మాటిరతన్ పురస్కారంతో సత్కరించబోతున్నారు. ఈసందర్భంగా అక్కడ నశీర్ అహ్మద్ ప్రత్యేక పర్యవేక్షణలో ‘చరితార్థుల’కు సంబంధించి సేకరించిన దాదాపు 150మంది ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. రెండు దశాబ్దాలుగా దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు ఫైజాబాద్‌లోని అష్ఫాఖుల్లా ఖాన్ స్మారక అమరవీరుల పరిశోధన సంస్థ మట్టిలో మాణిక్యం ‘మాటిరతన్’ పేరిట జాతీయ పురస్కారాలు అందిస్తోంది. ఈ దఫా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన చరిత్రకారుడు, బహు గ్రంథకర్త నశీర్ అహ్మద్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యకాంత్ పాండే ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.