ఆంధ్రప్రదేశ్‌

నేడు హ్యాపీనెస్ట్ రెండో విడత బుకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు వద్ద ఏపీ సీఆర్డీఏ నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు రెండో విడత ఫ్లాట్ల బుకింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. రెండో దశలో 900 ఫ్లాట్లను ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ఫ్లాట్ అలాట్ అయిన వారికి రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు తమ శాఖల ద్వారా 60 ఫెసిలిటేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని మీ-సేవ కేంద్రాల వద్ద కూడా ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం, ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన లేని ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఫ్లాట్ల కేటాయింపుపై గ్యారంటీ ఉండదు. అధికార వెబ్‌సైట్ ద్వారా ముందుకొచ్చిన వారికి కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. తొలిదశలో ఫ్లాట్ల బుకింగ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రెండో దశలో సర్వర్లు, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్‌ల సామర్థ్యాన్ని సీఆర్డీఏ అధికారులు పెంచారు. సుమారు 4లక్షల మంది ఒకేసారి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసినా ఇబ్బంది కలగకుండా సర్వర్ల స్థాయి పెంచారు. ఫ్లాట్ బుక్ చేసుకునే వ్యక్తులు భారతీయులైతే ఆధార్, ప్రవాస భారతీయులైతే పాస్‌పోర్టు నెంబర్లను విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేశాక, ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. వివరాలు సరిచూసుకున్నాక ‘బుక్ నౌ’ అనే బటన్ క్లిక్ చేస్తే, పేమెంట్ గేట్‌వేకు వెళ్తారు. అక్కడ 15 నిముషాల్లో అడ్వాన్సు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో చెల్లింపు జరగకపోతే, ఎంచుకున్న ఫ్లాట్ రద్దు అవుతుంది. అది వేరేవారికి అందుబాటులోకి వస్తుంది. చెల్లింపులకు సంబంధించి అనుమతిని ముందుగానే బ్యాంక్‌ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాపీనెస్ట్ ఫ్లాట్ బుకింగ్‌కు సంబంధించి అన్ని వివరాలు వెబ్‌సైట్‌లోని బుకింగ్ గైడ్‌లో పొందుపరిచామని సీఆర్డీఏ కమిషన్ చెరుకూరి శ్రీ్ధర్ వివరించారు.