ఆంధ్రప్రదేశ్‌

‘ఇస్తెమా’కు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 9: కర్నూలు జిల్లాలో మూడురోజుల ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం ‘ఇస్తెమా’ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రార్థన కార్యక్రమంగా పేరొందిన ‘ఇస్తెమా’ రెండోరోజు ఆదివారం దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ముస్లిం లు తరలి వస్తున్నందున ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి ఫరూక్‌ను ఆయన ఆదేశించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వౌలానా సాద్ సాహెబ్, వౌలానా జంషేద్ ప్రత్యేక ప్రార్థనలు, హజరత్ జీ కుమారుడు వౌలానా సన్మార్గ బోధనలతో ప్రజలు పునీతులవుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వౌలానా ఆధ్వర్యంలో జరిగే సామూహిక వివాహాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 600 మంది ఈ వివాహాలకు దరఖాస్తు చేసుకున్నారని మం త్రి ఫరూక్ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రత్యేకంగా రూ. 10కోట్ల బడ్జెట్‌ను ఇందుకోసం కేటాయించామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు దేశంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు.