క్రైమ్/లీగల్

నా భర్తను నాకు ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, డిసెంబర్ 9: పల్లె కోకిలగా గుర్తింపుపొంది దేశ వ్యాప్తంగా హల్‌చల్ సృష్టిస్తున్న తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు గ్రామానికి చెందిన బేబీ వివాదంలో చిక్కుకుంది. తన భర్తను బేబి అపహరించి, భర్తగా చెప్పుకుంటోందని పసల ఉషాకుమారి అనే మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసింది. సామర్లకోట బలులసుపేటకు చెందిన పసల ఉషాకుమారి తన భర్తను బేబీ అపహరించి తనకు అన్యాయం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం ఉదయం తొలుత స్థానిక ఉషారాణి తన పుట్టింటి వారితో కలసి విలేఖరుల సమావేశం నిర్వహించి, బేబీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం బేబి తన భర్తగా చెప్పుకుంటు న్న వజ్రరావుతో తనకు వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారని, పెళ్ళి ఫొ టోలు, ఆధార్, రేషన్ కార్డులను చూ పించింది. ఈ సందర్భం గా తన భర్తగా బేబీ వజ్రరావును ప్రపంచానికి పరిచయం చేస్తూ కూడా తిప్పుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించింది. బేబీకి గతంలో వివాహం అవ్వగా, వారు విడిపోయారని చెప్పిం ది. తాను ఇద్దరు పిల్లలతో వజ్రరావు త ల్లి ఇంటి వద్దే వడిశలేరులో కాపురం ఉంటున్నట్లు చెప్పింది. కొన్ని కుటుంబ తగాదాల వల్ల తమకు వజ్రరావు దూ రంగా ఉంటున్నట్లు చెప్పింది. ముఖ్యమంత్రికి కూడా బేబీ వజ్రరావును తన భర్తగా పరిచయం చేసుకుని సత్కారం పొందడం దారుణమన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను, అధికారులను కోరింది.

చిత్రం..బేబీపై ఫిర్యాదు చేస్తున్న ఉషాకుమారి