ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ పాలనలో రక్షణ వ్యవస్థ నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, డిసెంబర్ 9: రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను తెలుగుదేశం పార్టీ నాయకులు తొత్తులుగా మార్చేసుకున్నారని మాజీ డీజీపీ, బీజేపీ నెల్లూరు పార్లమెంటరీ కన్వీనర్ వి.దినేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది అవినీతిపరులైన పోలీసులు తమ చర్యలను కప్పిపుచ్చుకునేందుకే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నాను తాడేపల్లిగూడెం పర్యటనకు వెళ్తున్న తరుణంలో అరెస్టు చేయడం, పరిపూర్ణానందస్వామిని నగర బహిష్కరణ చేయడం, నిన్న తెలంగాణలో రేవంత్‌రెడ్డిని ఏ కారణాలు లేకుండా అరెస్టు చేయడమన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా తాను పనిచేసిన సమయంలో కూడా ఏనాడూ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నిధులు లేకపోయినా, కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని, దానిని ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. జగన్‌పై జరిగిన దాడి కేసు గురించి ఒక విలేఖరి ప్రశ్నించగా హైకోర్టులో కేసు జరుగుతోందని, దానిపై తాను మాట్లాడబోనని అన్నారు.