ఆంధ్రప్రదేశ్‌

హిందీ పోస్టులు భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న హిందీ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని హిందీ సేవా సదన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎన్ గైబువల్లి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా త్రిభాషా సూత్రం, రేషనలైజేషన్ జీవో 29, 42 ప్రకారం విద్యాహక్కు చట్టం ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా మోడల్ స్కూళ్లలో ఒక్క హిందీ పోస్టుకూ నియామకం జరగలేదన్నారు. దాదాపు 4500 హిందీ ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. ఇప్పటికే ఈవిషయమై వేలాది మంది హిందీ భాషా పండిత నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఇక గత నెల 29న రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన మెమోలో జీవో నంబర్ 73ను అనుసరించి గతంలో అప్‌గ్రేడ్ చేసిన వంద శాతం పోస్టుల్లో 70 శాతం మందికి ఇదివరకే ప్రమోషన్‌లు ఇచ్చారన్నారు. అయితే 30 శాతం డీఎస్సీ కోసం కొన్ని పోస్టులను మాత్రమే ఇప్పటికి చూపించారన్నారు. ఇప్పుడు వాటిని కూడా భాషా పండితులకే కేటాయించడం దారుణమన్నారు. అదికూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తర్వాత మెమో ఇవ్వడం, దానికి సంబంధించిన కంబైండ్ సీనియార్టీ లిస్ట్‌ను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు విడుదల చేస్తున్నారని అన్నారు. ఇది చాలా దారుణమని, డీఎస్సీలో చూపిన హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ఇది హిందీ ఉపాధ్యాయులకే కాదని, తెలుగు ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.