ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు బలం, బలహీనత.. రెండూ ప్రజలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలే బలం, బలహీనతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ఆయన్ని ఎదిరించి, బెదిరించాలనుకున్న వారంతా ఆయన కళ్లముందే కనుమరుగయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలకు పట్టిన చీడను తొలగించే ఒక మహాయజ్ఞాన్ని చంద్రబాబు ప్రారంభించారన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని కలుపుమొక్కల ఏరివేతకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంతో రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఆయన చేపట్టిన కలుపుమొక్కల ఏరివేతతో మోదీ, జగన్, పవన్, కేసీఆర్ రాజకీయాల నుంచి పారిపోతారని, దాంతో దేశ ప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉంటారని వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన వల్లే అధికారంలోకి వచ్చారంటున్న పవన్‌కళ్యాణ్‌కు నిజంగా దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీనీ ఏపీలో గెలిపించగలరా? అని వెంకన్న సవాల్ విసిరారు. అదే విధంగా, ఈ నెల 11 తర్వాత కేసీఆర్ మూటాముల్లె సర్దేసుకుని తెలంగాణ నుంచి పారిపోవడం ఖాయమని విమర్శించారు. ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తెలియడంతో ఏంచేయాలో పాలుపోక కేసీఆర్, ఆయన అనుమాయులు, టీఆర్‌ఎస్ నేతలు కుంటిసాకులతో కాలం గడుపుతున్నారన్నారు. తెలంగాణలో 70 స్థానాల్లో ప్రజా కూటమి ఘన విజయం సాధిస్తుందని వెంకన్న విశ్వాసం వ్యక్తం చేశారు.