ఆంధ్రప్రదేశ్‌

రామ మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు పెట్టాలని భువనేశ్వరి పీఠాధిపతి(కేశరపల్లి) కమలానంద భారతీస్వామి పేర్కొన్నారు. నగరంలోని ఎంవీపీకాలనీ అళ్వార్‌దాస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన రామమందిర సంకల్ప కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో జాతిని తట్టిలేపే పరిస్థితులు మళ్ళీ వచ్చాయని, అయోధ్య ఉద్యమానికి 25 ఏళ్ళు అయిందని, సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ సమాజాన్ని కదిలించిందన్నారు. 1986-87లో రామ,జానకి విగ్రహాలు వచ్చాయని, దేశంలో, రాష్ట్రాల్లో ప్రతి గ్రామగ్రామాన రామమందిరాలు ఉన్నాయని, అటువంటిది అయోధ్య రామజన్మభూమిలో మాత్రం రామునికి సొంత ఇల్లు లేదన్నారు. అయోధ్యలో రామమందిరం ఉంటే అక్కడి శక్తి వీటన్నింటికీ వస్తుందన్నారు. చైనా నుంచి కమ్యూనిస్టులు వెండి ఇటుకలు, రష్యా నుంచి రామశిలలు, అన్ని క్రైస్తవ దేశాల నుంచి ఇవి అయోధ్యకు వచ్చాయన్నారు. లంబాడీలు, గొండులు, మత్స్యకారులు ఇలా అన్ని వర్గాలకు చెందిన 25లక్షల జనపదుల నుంచి రామశిలలు వచ్చాయన్నారు. అవి రామమందిరంలో గోడల్లో ఎప్పుడు ఇముడుస్తారా? అని చూసేవన్నారు. వీహెచ్‌పీ అధినేత అశోక్‌సింఘాల్ నాయకత్వంలో కరసేవ విజయవంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని సమస్య విదేశీ సిద్ధాంతాలతో నడిచే రాజకీయపార్టీలకు ఏమిటి బాధ? అంటూ స్వామి ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, రాహుల్‌గాంధీ ఇలా విదేశీ సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీలకు చెందిన వారికి రామమందిరం పట్టదా? రామమందిరం విషయంలో వీరందర్నీ నిలదీయాలా? వద్దా అర్ధం చేయాలా? వద్దా? అంటూ మండిపడ్డారు. చెవులు వంచి చెప్పాలంటూ భారతీస్వామి పేర్కొన్నారు. వీరందరికీ ఈ మేసేజ్ పేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఐదు నిమిషాలతో చేరుతుందన్నారు. బాహుబలి-1,2 అయిపోయాయని, ఇక మూడవ కరసేవ అనేది లేదని, ఇది ఫైనల్ అంటూ ప్రసంగించారు. రామసేతువు ఉందని సుబ్రహ్మణ్యస్వామి పోరాడుతుంటే ఈ దేశంలో హిందుధర్మాన్ని రక్షించేందుకు రామమందిరం నిర్మాణానికి మూడు ఎకరాలు ఇవ్వడానికి శ్రద్ధ లేదని, అటువంటిది చర్చిలకు రెండు ఎకరాలు ఇవ్వడానికి చేతనైందా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు హిందు సమాజంతో ఆడుకుంటోందన్నారు. ఆక్రమణలతోనే చర్చిలు కడుగుతున్నారని, వీటికి అనుమతులే ఉండవని, అటువంటిది హిందువులు ఆలయాల నిర్మాణానికి మాత్రం అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు.
సాధుసంతువులు సాయి సుధాకర పూర్ణానందస్వామి, తులసిప్రకాష్ తదితరులు ప్రసంగిస్తూ రామమందిరం నిర్మాణానికి సంబంధించి సంకల్పం చేయాల్సి ఉందన్నారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి