ఆంధ్రప్రదేశ్‌

టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: ప్రజలకు మంచి యోగాల కోసమే అనాదిగా యజ్ఞ యాగాలు జరుగుతున్నాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే యజ్ఞ యాగ క్రతువులు లోక కళ్యాణం కోసం మరింతగా సాగాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎన్నో ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభతో టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతోందన్నారు. శ్రీ వ్యాసాశ్రమం, వ్యాస పీఠం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గౌతమ ఘాట్‌లో ఆదివారం ఓంకార సత్రయాగం ప్రారంభమైంది. యాగ క్రతువుకు ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు తదితరులు హాజరయ్యారు. వ్యాస మహర్షి మందిరాన్ని ప్రారంభించిన చిన రాజప్ప అనంతరం జరిగిన ఆధ్యాత్మిక సభలో ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆధ్యాత్మికత ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఓంకార సత్రయాగం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎపుడో ఎనభై ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ యాగం ఇపుడు మళ్ళీ నిర్వహించడం మంగళప్రదమన్నారు. ప్రజల్లో భక్త్భివం పెరిగిందన్నారు. ఇటువంటి యజ్ఞ, యాగాల్లో ప్రజలు పాల్గొని తరించాలన్నారు. మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆచార్య దోర్భల ప్రభాకర శాస్ర్తీ, వ్యాసాశ్రమ పీఠాధిపతి విమలానందగిరి స్వామి మాట్లాడారు.
అవినీతి సామ్రాట్ అవినీతి రహిత పాలన అందించడమా!
అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నీతి గురించి మాట్లాడ్డం, అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉండదని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవాచేశారు. అవినీతి గురించి మాట్లాడే జగన్ ముందు తన అవినీతి వ్యవహారాల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన విషయాన్ని, 11 ఈడీ కేసుల గురించి ఏమి సమాధానం చెప్తారని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమీ ఘాట్ వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంటే అవినీతి అంటూ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతిపరుడైన జగన్ తన పాదయాత్ర సభల్లో నీతులు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం ప్రజాకూటమికి అనుకూలమని, కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషి కూటమికి అనుకూలంగా మారిందన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, పద్దెనిమిది పార్టీల నాయకులకు కలవనున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట ఎంపీ మాగంట మురళీమోహన్ ఉన్నారు.
చిత్రం..యాగ ప్రారంభ సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప