ఆంధ్రప్రదేశ్‌

ఇకపై వ్యూహాత్మక అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 10: బీజేపీయేతర పార్టీల ఐక్యఫ్రంట్‌తో ప్రధాని మోదీని ఢీకొనేందుకు ఇకపై వ్యూహాత్మక అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సోమవారం ఢిల్లీలో జాతీయ నేతలతో సమావేశంతో పాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో చంద్రబాబు నేతృత్వంలో రూపొందించిన 17 జాతీయ స్థాయి అంశాలతో కూడిన 29 పేజీల అజెండానే ముఖ్యాంశంగా చర్చలు జరిగాయి.
దీంతో పాటు రాఫెల్ స్కాంకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకే మొగ్గు చూపాలని రెండు సమావేశాల్లో నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హక్కుల అమలుకు సంబంధించి ఆందోళనలతోపాటు, ఆపై ప్రతిపక్ష పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో రాఫెల్ కుంభకోణంపై నిరసన నిర్వహించటం ద్వారా లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింప చేయటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. కాగా ‘సేవ్ నేషన్- సేవ్ డెమోక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష, బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు చంద్రబాబు అందించారు. ఇందులో ప్రధానంగా స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో బీజేపీ విఫలమైన తీరును వివరించారు. గత నాలుగేళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా కంపెనీల కొమ్ముకాస్తూ రైతులకు క్లయిమ్‌ల విషయంలో ఏ రకమైన అవకతవకలు జరిగాయనేది విశదీకరించారు. గత నాలుగేళ్లుగా రైతులు చెల్లించిన ప్రీమియం విలువ రూ 17వేల 796 కోట్లు కాగా 2,767 కోట్లు మాత్రమే క్లెయిమ్‌లు చెల్లించారని, 15029 కోట్ల మేర బీమా కంపెనీలు లబ్ధి పొందిన తీరును లేవనెత్తారు. లాభాలనార్జించే ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)ను నిర్వీర్యం చేసి విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, జాతీయ స్థాయిలో ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రధానమంత్రికి అనుకూలమైన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారులను సీబీఐ వంటి సంస్థల్లో పదోన్నతిపై నియమించిన వైనంతో పాటు అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సర్కారియా కమిషన్ నివేదికకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు. ఆరోపణలపై స్పందించని, మీడియా సమావేశాలు నిర్వహించని మొదటి ప్రధానిగా మోదీ నిలిచారని విమర్శించారు. రూపాయి విలువ పతనం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష, పీఎన్‌బీ స్కాం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా, సీబీఐపై అవినీతి ఆరోపణలు, ప్రధానమంత్రి భాగస్వామ్యం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, జీడీపీలో వ్యత్యాసం తదితర అంశాల్లో మోదీ సర్కార్ వ్యవహారశైలిని గణాంకాలతో సహా వివరిస్తూ భారతదేశం సౌర్వభౌమాధికారం, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనకు మద్దతివ్వాలని కోరుతూ అజెండాకు రూపకల్పన చేశారు. మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయంగా ఆచితూచి అడుగువేయాలని నిర్ణయించారు. ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల ఐక్యఫ్రంట్ ఏర్పాటు, రాష్టస్థ్రాయిలో అనుసరించాల్సిన వ్యూహంపై మరోవిడత సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.