ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్ర దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 10: ప్రతీ ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కలలు కంటారని, వారి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తోందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ చెప్పారు. ఆరోగ్యంగా వుండి ఆర్థికంగా స్థోమత ఉన్నావారు హజ్ యాత్రకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2019 ఆగస్టులో జరిగే హజ్‌యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 12గా ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటలో తెలిపారు. ప్రైవేట్‌గా హజ్ యాత్ర చేస్తే నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. కాని హజ్‌కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లితే కేవలం రెండున్నర లక్షల రూపాయల లోపు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. సెంట్రల్ హజ్ కమిటీ నుండి సుమారుగా 3 వేల మంది హజ్ యాత్ర చేసుకోవటానికి మన రాష్ట్రానికి కోటా లభించిందన్నారు. అయితే మన రాష్ట్రం నుండి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదన్నారు. మన రాష్ట్రం నుండి 3 వేల మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
8 టీఎంసీల సామర్థ్యంతో వేదవతి ప్రాజెక్టు

విజయవాడ, డిసెంబర్ 10: కర్నూలు జిల్లాలో సాగు, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు హళహర్వి, మొలగవల్లిలో వేదవతి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రెండు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సోమవారం లేఖ రాశారు. కరవుతో సతమతమయ్యే ఆ జిల్లా పశ్చిమ ప్రాంతంలో 4 టీఎంసీల చొప్పున ఈ రెండు చోట్ల రిజర్వాయర్లను నిర్మించాలని గతంలో జలవనరుల శాఖ ప్రతిపాదించిందని తెలిపారు. ఇందుకు 1942 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయడాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం మొగలివల్లి వద్ద 1.02 టీఎంసీ, హళహర్వి వద్ద 2.02 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జలవనరుల శాఖ పంపిందని తెలిపారు. అధిక వ్యయం సాకుతో రెండు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించడం సరికాదని వ్యాఖ్యానించారు.
16న అమరావతి సిటీ రన్-2018

విజయవాడ, డిసెంబర్ 10: రాజధాని అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు పరుగుపై అవగాహన కల్పించేందుకు, రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి వివరించేందుకు ఈ నెల 16న అమరావతి సిటీ రన్-2018ను నిర్వహిస్తున్నట్లు అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ సీఈవో సగిలి షన్మోహను తెలిపారు. ఆ రోజు ఉదయం రాయపూడిలో ఏపీసీఆర్‌డీఏ కొత్త పరిపాలనా భవనం వద్ద నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఈ రన్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ కార్యాలయంలో సోమవారం రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉదయం ఆరు గంటలకు 21.1 కిలోమీటర్ల పరుగు, 7 గంటలకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ 2000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పోటీ అనంతరం కేటగిరీల వారీగా బహుమతులు ఉంటాయి. అమరావతి రన్నర్స్ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

‘ఇష్టం వచ్చినట్టు విమర్శలు తగదు’

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో కొందరు సోకాల్డ్ మేధావులు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ కుహానా రాజకీయాలు చేస్తున్నారని, వారంతా తమ ముసుగులు తొలగించుకుని బయటకు వచ్చి ఆయా పార్టీల్లో చేరి మాట్లాడితే ప్రజలు వారికి తగిన విధంగా సమాధానం చెబుతారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ సూచించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కల్లం అజయ్‌రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి పార్టీల కండువాలు కప్పుకోకుండానే తమ మనస్సుల్లో ఆయ పార్టీలపై ఉన్న అంతులేని వాత్సల్యానికి కట్టుబడి, రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. ప్రభుత్వంలో, న్యాయశాఖలో అత్యున్నత పదవులు నిర్వహించిన వారు తమ హోదాకు భిన్నంగా అల్పుల్లా మాట్లాడటం వారిలోని సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తోందని ఆమె ఆక్షేపించారు. పూర్తిగా అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీని సమర్థించేలా మాట్లాడటం ఈ కుహానా మేధావులకే చెల్లిందన్నారు. బీజేపీ నేత దగ్గుబాటి పురంధ్రీశ్వరి కాంగ్రెస్‌ను రాష్ట్రంలోకి అడుగుపెట్టనియ్యమని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు.