ఆంధ్రప్రదేశ్‌

విద్యా రంగంలో ఏపీది మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 11 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్ల దేశంలో 17వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలోకి వచ్చిందని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో బుధవారం జరిగే జ్ఞానభేరి కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు జ్ఞానభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జ్ఞానభేరి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. అలాగే ఇంగ్లీషు మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం జిల్లాలో యూనివర్సీటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి గంటా తెలిపారు.