ఆంధ్రప్రదేశ్‌

14 నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: రాజమహేంద్రవరంలో జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నారు. కందుకూరి వీరేశలింగం కళాపరిషత్ ఆవిర్భవించిన నేపధ్యంలో తొలిసారిగా సీఎంఆర్-కందుకూరి వీరేశలింగం కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీలు స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఈ నెల 14,15,16 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృ సమితి సౌజన్యంతో నిర్వహించే ఈ పోటీల వివరాలను ప్రొగ్రామ్ కన్వీనర్, సీనియర్ కళాకారుడు మద్దాల జానకీనాథ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ఎంపీ మాగంటి మురళీమోహన్, సీఎంఆర్ సంస్థ ఛైర్మన్ మావూరి వెంకటరమణ నిర్వహణలో కళాపరిషత్‌ను విజయవంతం చేయాలని కోరారు. 14న స్వాగత నృత్య ప్రదర్శన తో మొదలయ్యే ఈ పరిషత్ పోటీల్లో మొదటి రోజు దొంగలు, తలుపులు తెరిచేవున్నాయి అనే నాటికలు ప్రదర్శిస్తారు. 15న అనగనగా, రెండు నిశ్శబ్ధాల మధ్య, అందిన ఆకాశం నాటికలు, 16న పంజరం, పచ్చ చందురుడు, గోదాదేవి కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శించనున్నారు.