రాష్ట్రీయం

పీపీఏ కొనసాగింపు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: విశాఖ సమీపంలోని హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్‌తో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) కొనసాగింపును రద్దు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు ఏపీజెన్‌కో సరఫరా చేసే 538 మెగావాట్ల విద్యుత్, ఎన్టీపీసీ నుంచి 380 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 690 మెగావాట్ల విద్యుత్ వల్ల రాష్ట్రంలో భారీగా మిగులు విద్యుత్ ఉంది. దాదాపు 20,460 మిలియన్ యూనిట్ల మేర మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు పీపీఏల కొనసాగింపును రద్దు చేసేందుకు వీలుగా అనుమతి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో హిందూజా నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కొనసాగింపును రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదేశాలు జారీ చేసింది.