ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల సమరానికి బీసీలు సన్నద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 12: తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల సమరానికి బీసీ వర్గాలు సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపు ఇచ్చారు. బీసీ వర్గాలు ఆధిపత్య కులాలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైయ్యిందన్నారు. విజయవాడలోని ఒక హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వారి అధికారం, రాజకీయాల కోసం బీసీలను వాడుకుంటున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో 50 శాతం మించి వున్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో కలిసి 2019 ఎన్నికల్లో ఆధిపత్య కులాలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ప్రజల తీర్పు ప్రభావం ఆంధ్ర ఎన్నికలపైన ఉంటుందనటంలో సందేహం లేదన్నారు. తెలంగాణలో కూడా బీసీలు, అణగారిన కులాలు అధికారంలోకి రాలేదన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. ఆధిపత్య శక్తులే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక శక్తుల నాయకులు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బదులుగా, ఆధిపత్య కుల పార్టీలకు రాజకీయ బానిసత్యం చేసినందువల్లనే పరిస్థితి ఇలా ఉందన్నారు. బీసీల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ స్థాపిస్తామని మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన నాయకులు, తీరా ఎన్నికలోచ్చే సరికి ఏదో ఒక అగ్రకుల పార్టీలోకి దూరిపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో బీసీలు తమ తమ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో సంయుక్త కార్యాచరణకి నిర్దిష్టమైన పథకాలు రూపొందించుకోవాలన్నారు. ఇందుకోసం తగు కార్యాచరణ ప్రారంభించాలని జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయిలో ఉన్న బీసీ సంక్షేమ సంఘాలకు ఆయన సూచించారు. రాష్ట్ర కార్యవర్గం త్వరలోనే సమావేశమై రాజకీయ కార్యక్రమాన్ని, ఎన్నికల బరిలో చేపట్టవలసిన విధి విధానాలను తెలియజేస్తుందన్నారు. వీటిని గమనంలోనికి పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేటి తాజా రాజకీయ పరిస్థితులు బీసీలు, ఇతర అణగారిన కులాలకు చాలా సానుకూలంగా ఉన్నాయన్నారు. 20శాతం కూడాలేని ఆధిపత్య కులాలు అధికారం కోసం పరస్పర ఆరోపణలు చేసుకోవడం 80 శాతం ప్రజలకి గొప్ప సదవకాశంగా తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం వెనుకబడ్డ కులాల విజ్ఞత మీద ఆధారపడి వుందన్నారు. ఈ దిశగా ముందడుగు వేయాలని ఆయన కోరారు.