ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ ప్రజలు బాబును తరిమేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, డిసెంబర్ 12: తెలంగాణ ప్రజలు చంద్రబాబును తమ రాష్ట్రంలోకి రానివ్వకుండా తీర్పు ఇచ్చి, సరైన బుద్ధిచెప్పారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని ఆయన నివాసంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గోవిందా...గోవిందా అంటూ కాపునేతలతో కలిసి ముద్రగడ విలేఖర్ల సమావేశం ప్రారంభించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేస్తున్న కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నారని అటువంటి తెలంగాణలో చంద్రబాబు వేలు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరివీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని వనరులు సరిపోక తెలంగాణలో ఉన్న వనరులు, ఆదాయాలను కబ్జా చేయాలని చేసిన ప్రయత్నాన్ని తెంగాణ ప్రజలు తిప్పికొట్టారన్నారు. 2014లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబుకు ఆంధ్రాలోనూ ఇదే తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా తనంత మేధావి లేడంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీన 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులతో భవిష్యత్తు కార్యాచరణ సమావేశం నిర్వహిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, తుమ్మపల్లి రమేష్, ఆకుల రామకృష్ణ, గుండా వెంకటరమణ, కల్వకొలను తాతాజీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.