ఆంధ్రప్రదేశ్‌

డీలర్లకు మధ్యాహ్న భోజన బియ్యం కమీషన్ చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: రేషన్ డీలర్లకు ప్రభుత్వం బకాయిపడిన మధ్యాహ్న భోజన పథకం బియ్యం కమీషన్‌ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యానికి ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తుంది. అయితే గత కొద్దినెలలుగా తమకు చెల్లింపులు జరపటంలేదని రేషన్‌డీలర్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు దృష్టికి తెచ్చారు. ఈ విషయమై అధికారుల సమావేశంలో మంత్రి ఆరా తీశారు. తక్షణమే కమీషన్‌ను చెల్లించాలన్నారు. మూడు నెలల్లో చెల్లింపులు పూర్తిచేయాలని నిర్దేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ పోస్ విధానం అమలైనప్పటి నుంచి పెండింగ్ మొత్తాన్ని చెల్లించేందుకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.