ఆంధ్రప్రదేశ్‌

జస్టిస్ పున్నయ్య సేవలు అనిర్వచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పేద దళిత, బడుగు బలహీన వర్గాలకు జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య చేసిన సేవలు అనిర్వచనీయమని, వాటిని కొనసాగించడమే ఆయనకు నిజమైన ఘన నివాళి అని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. బుధవారం నగరంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధ్యక్షతన జస్టిస్ పున్నయ్య సంతాప సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్ల రామయ్య మాట్లాడుతూ దివంగత కొత్తపల్లి పున్నయ్య తన జీవితంలో అన్ని కులాల వారికి తన సేవలతో చేరువయ్యారన్నారు. శాసనసభ్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా తర్వాత జిల్లా జడ్జిగా, హైకోర్టు జడ్జిగా పని చేసి ఎన్నో విప్లవాత్మకమైన తీర్పులను ఇచ్చారన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సమాజంలో ఉన్న అంటరానితనం, రెండు గ్లాసుల విధానాలను రూపుమాపేందుకు జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో వన్‌మెన్ కమిషన్‌ను ప్రభుత్వం వేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ దివంగత జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య మృతి దళిత, బహుజన వర్గాలకు తీరని లోటని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయా కులాలకు సేవలు అందించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తనవంతు పాత్రను నిర్వహిస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు తొలి చైర్మన్‌గా కొత్తపల్లి పున్నయ్య దళిత వర్గాలకు ఎంతో సేవలు అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ మంచి జ్ఞానంతో చదువుకున్న వ్యిక్తి జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య అని అన్నారు.

చిత్రం..జస్టిస్ పున్నయ్యకు నివాళులర్పిస్తున్న వర్ల రామయ్య, కారెం శివాజీ