ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఎక్కడ విఫలమైందో.. కేసీఆర్ ఎక్కడ సఫలమయ్యారో విశే్లషించుకుంటామని ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి జమ్మలమడుగు ఆది నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించిందన్నారు. ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించటం వల్ల గెలుపు సాధ్యపడిందని తెలిపారు. ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కంటే అభివృద్ధి ఏపీలో ఎక్కువ జరిగిందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంపర్ మెజారిటీతో విజయం సాధించటం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే లోటుబడ్జెట్ ఉన్న ఏపీలో లక్షన్నర వరకు రైతులకు తమ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ 10వేల ఆర్థిక సాయం అందిందని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా పోటీచేయని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు టీఆర్‌ఎస్ గెలుపును తమ గెలుపుగా భావించి సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేయని బీజేపీకి టీడీపీ దూరమైతే వైసీపీ, జనసేన మద్దతు పలకడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజయవాడ వచ్చి ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడని దానివల్ల తమ పార్టీకే లాభమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధిసాధించి వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో రివార్డులు సాధించామని ప్రజల్లో విశ్వసనీయత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ చతురతే వచ్చే ఎన్నికల్లో విజయ సోపానాలని స్పష్టం చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి