ఆంధ్రప్రదేశ్‌

టీఆర్‌ఎస్ గెలిస్తే ఏపీలో సంబరాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 13: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రత్యేక హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్రప్రభుత్వానికి మద్దతుగా టీఆర్‌ఎస్ పార్టీ వ్యవహరించిందని, అలాంటి పార్టీ విజయం సాధిస్తే ప్రతిపక్ష వైసీపీ, జనసేనలకు చెందిన నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో సంబరాలు చేసుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. నిత్యం ఏపీపై విషం చిమ్మే కేసీఆర్‌కు వైసీపీ, జనసేనలు వత్తాసు పలకడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తనఖా పెడుతూ వ్యక్తిగత లబ్ధికోసం కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతివ్వడం ఏపీ ప్రజలను వంచిండమే అవుతుందన్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు ఏపీ ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం తాళాలు వేసినా జగన్ నోరు మెదపక పోవడం వెనుక ఆంతర్యమేంటని ఆనందబాబు ప్రశ్నించారు. బయ్యారం గనుల్లో జగన్ బినామీలపై చర్యలు లేకుండా చూడటం, జగన్ హైదరాబాద్‌కు వెళ్తే జడ్ కేటగిరి బందోబస్తు ఏర్పాటు చేయడం వంటివి దేనికి సంకేతాలో ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఏపీ ప్రజలు శాంతికామకులని అటువంటి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు, అతని చీకటిమిత్రుడు జగన్మోహనరెడ్డికి ఆంధ్రాప్రజలు త్వరలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆనందబాబు పేర్కొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆనందబాబు